నేను మీ మనిషిని – ఆశీర్వదించాలని కోరిన సర్పంచ్ అభ్యర్థి గంగామణి గడ్డం సుభాష్

నేను మీ మనిషిని – ఆశీర్వదించాలని కోరిన సర్పంచ్ అభ్యర్థి గంగామణి గడ్డం సుభాష్

ముధోల్, (మనోరంజని తెలుగు టైమ్స్): డిసెంబర్ 14

తాను ప్రజల్లో ఒకడినేనని, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ముధోల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గంగామని గడ్డం సుభాష్ ప్రజలను కోరారు. ఆదివారం ముధోల్ గ్రామంలో గడపగడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ—గతంలో ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలోనే కాకుండా, లేని సమయంలో కూడా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అనేక సేవలు అందించామని గుర్తు చేశారు. ముఖ్యంగా అత్యవసర వైద్యం అవసరమైన సందర్భాల్లో తమను సంప్రదించిన ప్రతి ఒక్కరికీ స్పందిస్తూ సహాయం చేశామని తెలిపారు. తమను గెలిపిస్తే గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. ముధోల్ గ్రామంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆసుపత్రి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వాగ్దానం చేశారు. అలాగే గ్రామంలో ఉన్న ఇతర సమస్యలను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చూపుతామని పేర్కొన్నారు. గతంలో తాము చేసిన సేవలే నేడు ప్రజా క్షేత్రంలో తమను నిలిపాయని పేర్కొంటూ, అన్ని వర్గాల ప్రజలు తనను తమ బిడ్డగా భావించి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆకాంక్షించారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment