YOYO హోటల్ గదిలో విద్యార్థిని పై అత్యాచారం: షీ టీం రక్షణ చర్యలు

YOYO హోటల్ Hyderabad Incident
  • ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఆధారంగా విద్యార్థిని నిర్బంధించి 20 రోజుల పాటు అత్యాచారం.
  • షీ టీం సకాలంలో స్పందించి బాధితురాలిని రక్షించారు.
  • నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం.

హైదరాబాద్‌లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడు విద్యార్థిని YOYO హోటల్ గదిలో నిర్బంధించి 20 రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలియగానే బాధితురాలు తన తల్లిదండ్రులకు సమాచారం అందించి, షీ టీం పోలీసులు హోటల్‌కు చేరుకుని ఆమెను రక్షించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

హైదరాబాద్‌లో మరోసారి ఘోర ఘటన చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లాలోని భైంసాకు చెందిన ఓ విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయిన యువకుడు, బలవంతంగా హైదరాబాద్‌కు పిలిపించి, YOYO హోటల్ గదిలో 20 రోజులపాటు నిర్బంధించాడు. ఈ సమయంలో అతను అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలు తన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా విషయం తెలియజేయడంతో, వారు వెంటనే హైదరాబాద్‌కు చేరుకుని షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. బాధితురాలు వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేయడంతో, పోలీసులు నారాయణగూడ ప్రాంతంలోని YOYO హోటల్‌లో ఆమెను గుర్తించి రక్షించారు.

నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. ప్రస్తుతం పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

ఈ సంఘటనతో ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియాలో పరిచయాలను జాగ్రత్తగా కొనసాగించాల్సిన అవసరం ఎంతైన ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version