-
గాడేకర్ శివ యూట్యూబ్ ఛానల్ కు గోల్డ్ ప్లేట్ రావడం అభినందనీయం.
-టీ మంగాయి సందీప్
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏ ఎస్పీ అవినాష్ కుమార్, మంగాయి ఫౌండేషన్ చైర్మన్ మంగాయి సందీప్ రావ్
-టీం మంగాయి సందీప్ రావ్ ఆధ్వర్యంలో గాడేకర్ శివకు సన్మాన కార్యక్రమం
నిర్మల్ జిల్లా భైంసా మండలం ధాబాలింగి గ్రామానికి చెందిన గాడేకర్ శివ గారికి యూట్యూబ్ ఛానల్ ద్వారా గోల్డ్ ప్లేట్ రావడం శుభ సూచకమని ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. ఇంగ్లీష్ లెర్నింగ్ అంశాలపై వీడియోలు రూపొందించి, దేశ విదేశాల్లో ఉన్న వినియోగదారులకు ఇంగ్లీష్ నేర్పడం గొప్ప ఘనత అని అన్నారు.
ఈ సందర్భంగా, మంగాయి ఫౌండేషన్ చైర్మన్ మంగాయి సందీప్ మాట్లాడుతూ, గాడేకర్ శివ నియోజకవర్గానికి ఆదర్శంగా నిలిచారని, ఇంటర్నెట్ సద్వినియోగంతో విద్యను ఇతరులకు అందిస్తూ సంపాదించవచ్చని యువతకు పాఠం చెప్పిన వ్యక్తిగా అభివర్ణించారు.
ఈ సన్మాన కార్యక్రమం మంగాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు జావిద్ ఖాన్, బిజెపి యువ నాయకులు బాజీరావు పటేల్, బిజెపి ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్, కాంగ్రెస్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు అంజద్ షేక్, మహిళా మోర్చ అధ్యక్షురాలు బిజెపి అర్చన, ఎమ్మార్పీఎస్ నాయకులు నందకుమార్, గోనిగర్ శంకర్, నామత్కర్ దిగంబర్, తదితరులు పాల్గొన్నారు.