- భోజ్‌పురి నటుడు, నిర్మాత సుదీప్ పాండే మృతి.
- జనవరి 5న పుట్టిన రోజు జరుపుకున్న సుదీప్.
- ముంబైలో సినిమా షూటింగ్‌లో గుండెపోటుతో కుప్పకూలి ఆస్పత్రిలో మృతి.
భోజ్‌పురి నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు సుదీప్ పాండే గుండెపోటుతో మృతి చెందారు. జనవరి 16న ముంబైలో సినిమా షూటింగ్‌లో గుండెపోటుతో కుప్పకూలిన ఆయన, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ‘భోజ్‌పురి భయ్యా’తో సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన సుదీప్, యాక్షన్ హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు.
భోజ్‌పురి చిత్ర పరిశ్రమ ప్రముఖ యంగ్ హీరో సుదీప్ పాండే జనవరి 16న గుండెపోటుతో మృతి చెందారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో గుండెపోటుతో కుప్పకూలిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే జనవరి 5న పుట్టిన రోజు జరుపుకున్న ఆయన, మరణ వార్తతో కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
సినిమాల్లో నటనతో పాటు నిర్మాణంలోనూ విశేష కృషి చేసిన సుదీప్, ‘ఖూనీ దంగల్’, ‘మసీహా బాబు’ వంటి హిట్ చిత్రాల్లో యాక్షన్ హీరోగా గుర్తింపు పొందారు. సినిమాల్లో విజయవంతమైన కెరీర్‌ను కొనసాగిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్సీపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కెరీర్‌ను ఆరంభించిన సుదీప్, 2007లో ‘భోజ్‌పురి భయ్యా’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించి యాక్షన్ హీరోగా నిలిచారు. అతని మృతి భోజ్‌పురి పరిశ్రమకు తీరని లోటు.