నిర్మల్, 12 July
రాష్ట్రంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో, వాతావరణ నిపుణులు శుభవార్త అందించారు. ఈ నెల 16వ తేదీ నుంచి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వారు తెలిపారు. 19వ తేదీ తర్వాత వర్షాలు మరింత ఊపందుకుంటాయని అంచనా వేశారు.
రాష్ట్రంలో వర్షాలు లేక రైతులు, సామాన్య ప్రజలు అల్లాడుతున్న వేళ వాతావరణ నిపుణులు శుభవార్త చెప్పారు. ఈ నెల 16వ తేదీ నుంచి వర్షాలు పడే అవకాశం ఉందని వారు వెల్లడించారు.
16 నుంచి 19వ తేదీ మధ్య అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అయితే అవి కూడా వేడి వాతావరణం వల్ల సంభవించే వానలేనని తెలిపారు. 19వ తేదీ తర్వాత నుంచి వర్షాలు ఊపందుకునే ఆస్కారముందని పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో ఎండలు వేసవిని తలపిస్తున్న విషయం తెలిసిందే.












