Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడం పోలీస్ స్టేషన్ అధికారి సాయి కిరణ్ సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కడం ప్రాజెక్టు దిగువన ఉన్న గోదావరి తీర ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడం పోలీస్ స్టేషన్ అధికారి సాయి కిరణ్ సూచించారు.
వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కడం ప్రాజెక్టుకు దిగువన ఉన్న గోదావరి తీరం ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆయన హెచ్చరించారు.
నది, వాగులు, చెరువుల వద్దకు వెళ్లకుండా, అధికారులు సూచించిన భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ఎస్సై సాయి కిరణ్ విజ్ఞప్తి చేశారు.












