హైదరాబాద్, 2020-07-15
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయని, ఇది రుతుపవనాలను చురుగ్గా మార్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇక నుండి అతిఇక వర్షాలకు కారణమవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూలై రెండో పక్షంలో ఈ వర్షాలు ఇక వర్షాలే,లో కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ఇది రుతుపవనాలను చురుగ్గా మార్చి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలకు కారణమవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకి నెలరోజులు గడుస్తున్నా, ఇప్పటివరకు లోటు వర్షపాతమే కొనసాగుతోంది. జూన్ నెలలో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు తప్ప భారీ వర్షాలు కురవలేదు. జూలై మొదటి పక్షం కూడా నిరాశాజనకంగానే గడిచింది. వర్షాలు లేకపోవడంతో ఎండలు తీవ్రమయ్యాయి. దీంతో పంటల విషయంలో వరుణుడిపైనే ఆశలు పెట్టుకున్న రైతులు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. అయితే, జూలై రెండో పక్షంలో (15-31 తేదీల్లో) భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చల్లని కబురు అందించారు.
కొద్ది రోజులుగా మందగించిన రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే బంగాళాఖాతంలో ఓ ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది రాబోయే 24 నుండి 48 గంటల్లో బలపడి అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై బలంగా ఉంటుందని, జూలై 15 (బుధవారం) నుండే వర్షాలు మొదలవుతాయని వెల్లడించింది. ఈ వర్షాలు మరింత జోరందుకుని, జూలై రెండో పక్షంలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లోటు వర్షపాతమే కొనసాగుతోంది. జూలై రెండో పక్షంలో కురిసే వర్షాలు ఈ లోటును భర్తీ చేసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే, ఇకపై భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని భావించవచ్చు.
ఆంధ్రప్రదేశ్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో, తెలంగాణలో ఉత్తర, తూర్పు జిల్లాల్లో రాబోయే నాలుగైదు రోజుల్లో వర్షాలు ఊపందుకుంటాయని వెల్లడించారు. కొన్నిచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, ఒకటి రెండు చోట్ల ముంబై తరహా కుండపోత వర్షాలు కూడా ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని నదులు, వాగులు, వంకలు, జలాశయాలు, చెరువులు జలకళను సంతరించుకుంటాయని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం, జూలై 15 నుండి నెమ్మదిగా వర్షాలు ప్రారంభం కానున్నాయి. గత నాలుగైదు రోజులుగా తెలంగాణలో పొడి వాతావరణం, వేసవి తరహాలో ఎండలు, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ ఇకపై వాతావరణం పూర్తిగా మారబోతోందని వెదర్ మ్యాన్ తెలిపారు.
జూలై 15న ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కొనసాగినా, సాయంత్రం ఒక్కసారిగా ఆకాశాన్ని మేఘాలు కమ్మేసి చిరుజల్లులు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, గద్వాల, నల్గొండ, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో సాయంత్రం నుండి రాత్రివరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.












