SPSR Nellore/Chejerla (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 21
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న భారీ వర్షాలు కురిశాయి. తిర్యాణిలో అర్ధరాత్రి కుండపోత వాన కురిసిన నేపథ్యంలో వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలు గ్రామాలకు వెళ్లే మార్గమధ్యంలో ఉన్న లో-లెవెల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పరిస్థితిని అంచనా వేసిన అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా, తిర్యాణిలో అర్ధరాత్రి కుండపోత వాన కురిసింది. దీంతో జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలు గ్రామాలకు వెళ్లే మార్గమధ్యంలో ఉన్న లో-లెవెల్ వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పరిస్థితిని అంచనా వేసిన అధికారులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వంతెనలు, వాగుల వద్దకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.












