మేమున్నాం అంటున్న మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్
మనోరంజని తెలుగు టైమ్స్, ప్రొద్దుటూరు – నవంబర్ 30
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రాయప్ప అనే వృద్ధుడు మరణించిన అనంతరం, ఆయనకు బంధువులు ఎవరూ లభించకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు చిక్కులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది సమాచారం మేరకు మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ టౌన్ అధ్యక్షుడు సుబహాన్ స్పందించి, వృద్ధుడి అంతిమ సంస్కారాలను బాధ్యతగా చేపట్టారు.
ఆదివారం హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమానికి చేయూతనందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా, కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు సుమన్ బాబు తదితరులకు ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
మా ‘శ్రీ అమ్మ శరణాలయం’లోని వృద్ధులకు సహాయం అందించదలచిన దాతలు క్రింద తెలిపిన ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని ఫౌండేషన్ అభ్యర్థించింది.
సంప్రదించవలసిన నంబర్లు:
82972 53484,
91822 44150.