ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాం
గ్యాస్ పోయి గుర్తుకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి
– 12వ వార్డు సభ్యులు విశాఖ సునీల్ జోంధలే
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – ముధోల్, డిసెంబర్ 11
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 12వ వార్డు సభ్యులు విశాఖ సునీల్ జోంధలే గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. తనకు కేటాయించిన గ్యాస్ పోయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వార్డులో ఉన్న మౌలిక వసతుల లోపాలను దృష్టిలో ఉంచుకుని రోడ్లు, కాలనీ స్వచ్ఛత, డ్రైనేజీ, వీధిదీపాలు వంటి అభివృద్ధి పనులను పారదర్శకంగా చేపడతామని తెలిపారు. ప్రజల సమస్యలను తరచూ పర్యవేక్షించి, వాటి పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా అవగాహన కల్పించడం, ప్రతి నెల వైద్య శిబిరాలు నిర్వహించడం, అలాగే వార్డు జనతాదర్బార్ ద్వారా ప్రజల సమస్యలను స్వీకరించి పరిష్కార మార్గం చూపే బాధ్యత తమదేనని జోంధలే పేర్కొన్నారు.
ప్రచార కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు.