*అందరినీ కలుపుకుని అభివృద్ధి వైపు ముందుకు సాగుతా** “*ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి**

**అందరినీ కలుపుకుని అభివృద్ధి వైపు ముందుకు సాగుతా**
“*ఉంగరం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి**
**సర్పంచ్ అభ్యర్థి కోరి అనిత పోతన్న**

మనోరంజని తెలుగు టైమ్స్ ముధోల్ డిసెంబర్ 11

ముధోల్:గ్రామస్థులందరిని తన స్వంత కుటుంబంలా భావిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ముధోల్ సర్పంచ్ అభ్యర్థి కోరి అనిత పోతన్న అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.ఒక వార్డు మెంబర్ స్థాయిలో ఉండి ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో పాల్గొన్న తనను రానున్న ఎన్నికల్లో గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. గతంలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని వాటిని గుర్తించి ప్రజలు తనకు మద్దతివ్వాలన్నారు.నేటి వరకు ఎవరిని కించపరిచే భావం తనకు లేదని అన్నీ వర్గాల ప్రజలను కలుపుకుని ముందుకు సాగుతూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని స్పష్టం చేశారు.గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలైనా తాగు నీరు,రోడ్లు, డ్రైనేజీ ల వ్యవస్థ,గ్రామ పరిశుభ్రత అదేవిధంగా ప్రధాన సమస్యైన ఆసుపత్రి భవన నిర్మాణం గెలిచిన త్వరిత సమయంలోనే అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేస్తున్నారు.అవినీతి రహిత పారదర్శకమైన పాలనకు ప్రాధాన్యతనిస్తానని హామీనిస్తూ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీ తో కల్పించాలని విన్నవించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment