పోలీస్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్
మనోరంజని తెలుగు టైమ్స్, మెండోరా ప్రతినిధి – ఆగస్టు 8:
అమరవీరుల దినోత్సవం సందర్భంగా మెండోరా మండలంలోని పోచంపాడు గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో పాఠశాల విద్యార్థులు, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. టోర్నమెంట్‌ను మెండోరా ఎస్సై సువాసిని ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ — “మత్తు పదార్థాల వలన యువత భవిష్యత్తు దెబ్బతింటుంది. విద్యార్థులు క్రీడలను అలవాటు చేసుకుంటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు” అని తెలిపారు. తరువాత టోర్నమెంట్‌లో విజేతలైన విద్యార్థులకు ట్రోఫీలు, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు