విటోలి తండా సర్పంచ్–ఉప సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక
గ్రామస్థుల సమ్మతి… పంచాయతీలో ఉత్సాహభరిత వాతావరణం
ముధోల్, డిసెంబర్ 01 (మనోరంజని తెలుగు టైమ్స్):
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని విటోలి తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. దివంగత మాజీ సర్పంచ్ రాథోడ్ విఠల్ కుమారుడు రాథోడ్ కాంతారావును సర్పంచ్‌గా, రాథోడ్ గజానంద్‌ను ఉప సర్పంచ్‌గా గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు ఒకే అభిప్రాయానికి రావడంతో ఎలాంటి పోటీ లేకుండా ఈ ఎన్నిక పూర్తయినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధత కలిగిన నాయకత్వాన్ని ముందుకు తేవాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఏకగ్రీవ ఎన్నికలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామ పంచాయతీ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామంటూ కొత్తగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ భరోసా వ్యక్తం చేశారు.!