*తిరుమలలో డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు*
తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు TTD ప్రకటించింది. తొలి 3 రోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా, తర్వాత 7 రోజులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా సర్వదర్శనాలు ఉంటాయని తెలిపింది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా ఇతర ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈనెల 27 నుంచి Dec 1 వరకు వెబ్సైట్, యాప్లో ఈ-డిప్కు నమోదు చేసుకోవచ్చని చెప్పింది.