వశిష్ఠ హైస్కూల్ విద్యార్థుల సేవా కార్యక్రమం — వృద్ధాశ్రమానికి విరాళాలు
మనోరంజని తెలుగు టైమ్స్ – నిర్మల్ నవంబర్ 27
ఆదర్శ్‌నగర్‌లోని వశిష్ఠ హైస్కూల్ విద్యార్థులు సేవా దృక్పథంతో ముందుకు వచ్చి శ్రీ సాయి అనాధ వృద్ధాశ్రమం వారికి తమ వంతు సహాయంగా విరాళాలు సేకరించి అందజేశారు. వృద్ధులకు అండగా నిలవాలనే సంకల్పంతో విద్యార్థులు పాల్గొనడం ప్రశంసనీయం అని పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే సేవ భావన పెంపొందాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక విరాళాలు సేకరించిన విద్యార్థులకు మెడల్స్ ప్రదానం చేశారు. మొదటి 5 స్థానాల్లో నిలిచిన విద్యార్థులు — నౌమన్ (6వ తరగతి), శ్రవణ్ (8వ), రక్షిత్ (8వ), కేతన్ నాయక్ (1వ), ఆర్యన్ (3వ) — ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గొల్లపల్లి మాధవి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.