బాసర ఆలయంలో వానరాల వీరంగం
భయభ్రాంతులకు గురవుతున్న అమ్మవారి భక్తులు
బాసర మనోరంజని ప్రతినిధి నవంబర్ 1
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వానరాల వీరంగం మళ్లీ పునరావృతమైంది. దీంతో అమ్మవారి భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో సహితం ఎన్నోసార్లు చిన్నారులపై వానరాలు దాడి చేసి గాయపడిన సందర్భాలు ఉన్నాయి. చేతుల్లో ఉన్న ప్రసాదాలను సైతం లాక్కొని వెళ్ళి భక్తులపై విరుచుకుపడ్డ వానరాలు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వానరాలను అటవీ ప్రాంతంలో వదిలేయాలని భక్తులు అధికారులను కోరుతున్నారు.