హరిహర ఎంటర్‌ప్రైజెస్ చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

హరిహర ఎంటర్‌ప్రైజెస్ చోరీ కేసులో ఇద్దరు అరెస్ట్

మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ, నవంబర్ 21

బాల్కొండ మండల కేంద్రంలోని హరిహర ఎంటర్‌ప్రైజెస్ లో చోటుచేసుకున్న చోరీ కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని సొత్తును రికవరీ చేసినట్లు ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.శుక్రవారం బాల్కొండ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై సురేందర్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ వివరాలు వెల్లడిస్తూ ఇటీవల హరిహర ఎంటర్‌ప్రైజెస్‌లో దొంగతనం జరిగినట్లు గుర్తించామన్నారు. దొంగిలించిన సొత్తును టాటా ఏసీ వాహనంలో పోచంపాడుకు తరలిస్తుండగా పోలీసులకు దొంగలు చిక్కారని తెలిపారు. నిందితులైన సంకట తేజ, మీసాల అజయ్ లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment