ప్రముఖ వ్యాపారవేత్త దిలీప్ పవార్‌కు తుల్జా భవాని ఆలయ కమిటీ సభ్యుల సన్మానం

ప్రముఖ వ్యాపారవేత్త దిలీప్ పవార్‌కు తుల్జా భవాని ఆలయ కమిటీ సభ్యుల సన్మానం

ప్రముఖ వ్యాపారవేత్త దిలీప్ పవార్‌కు తుల్జా భవాని ఆలయ కమిటీ సభ్యుల సన్మానం

మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్ ప్రతినిధి

మానై సందర్భంగా నగరంలోని వినాయక్‌నగర్‌లో గల తుల్జా భవాని మాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ వ్యాపారవేత్త దిలీప్ పవార్ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా దిలీప్ పవార్ మాట్లాడుతూ – “వినాయక్‌నగర్ తుల్జా భవాని ఆలయానికి మొదటిసారి దర్శనానికి రావడం నాకు భాగ్యంగా భావిస్తున్నాను. అమ్మవారి కృప కటాక్షాలు మా కుటుంబంపైనే కాకుండా నగర ప్రజలందరిపైనా ఎల్లప్పుడూ ఉండాలి. తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే” అని అన్నారు.

అలాగే ఆలయ నిర్వాహకులు భాగ్యశ్రీ పోలాస సత్యనారాయణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిరంతరాయంగా వసంత పంచమి, దేవీ నవరాత్రులలో మహారాష్ట్ర బృందం ద్వారా ప్రత్యేక గొందల్ మరియు భజన కార్యక్రమాలు నిర్వహించడంలో భాగ్యశ్రీ పోలాస సత్యనారాయణ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.

కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఎన్‌హెచ్ఆర్సి జిల్లా అధ్యక్షులు మాల్వేకర్ ధర్మేంద్రతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment