రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
ఎమ్4 ప్రతినిధి ముధోల్
మండల కేంద్రమైన ముధోల్ లోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని విగ్రహానికి తహసిల్దార్ శ్రీకాంత్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ప్రత్యేకంగా గుర్తింపు పొందిందన్నారు. యువత మహనీయుల జీవిత చరిత్రను విధిగా చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తాటివార్ రమేష్, మోహన్ యాదవ్, ఆర్ఎంపి అసోసియేషన్ మండల అధ్యక్షుడు చాతరాజు దుర్గాప్రసాద్, దళిత సంఘాల నాయకులు మహేందర్, ధమ్మపాల్, యువకులు పాల్గొన్నారు.