తెలుగు సినీ పరిశ్రమలో విషాదం – హీరో సోహైల్ కు మాతృ వియోగం

హీరో సోహైల్ తల్లి
  • హీరో సోహైల్ తల్లి కిడ్నీ సమస్యతో మరణం
  • హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి
  • బిగ్‌బాస్ సెలబ్రిటీల సంతాపం
  • కరీంనగర్‌లో అంత్యక్రియలు

హీరో సోహైల్ తల్లి

తెలుగు సినీ హీరో సోహైల్ తల్లి కిడ్నీ సమస్యలతో బాధపడుతూ, హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సోహైల్ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. పలువురు బిగ్‌బాస్ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు. సోహైల్ తల్లి పార్థివదేహాన్ని కరీంనగర్‌కు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

 

సెప్టెంబర్ 17, హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు సినీ నటుడు, బిగ్‌బాస్ సీజన్ 4లో తన అగ్రెషన్‌తో ప్రజల హృదయాలను గెలుచుకున్న హీరో సోహైల్ ఇంట్లో మంగళవారం మధ్యాహ్నం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన సోహైల్, బిగ్‌బాస్ ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సీజన్ 4లో తన గేమ్ ప్లే, అగ్రెషన్ తో ఫేమస్ అయిన సోహైల్, హౌస్ నుంచి బయటకొచ్చిన తరువాత పలు సినిమాల్లో నటించాడు. ‘బూట్ కట్ బాలరాజు’ వంటి సినిమాలతో ఫర్వాలేదనిపించాడు.

ఇప్పటికే కొన్ని నెలలుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న సోహైల్ తల్లిని హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ కోసం చేర్పించారు. అయితే చికిత్సకు స్పందించకపోవడంతో ఆమె పరిస్థితి మరింత విషమించింది. ఈ రోజు మధ్యాహ్నం సోహైల్ తల్లి మరణించడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

ఈ వార్త తెలుసుకున్న పలువురు బిగ్‌బాస్ సీజన్ 4కి చెందిన సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు సోహైల్ కుటుంబానికి తమ సంతాపం తెలియజేశారు. సోహైల్ తల్లి పార్థివదేహాన్ని కరీంనగర్‌కు తరలించి, అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment