మిర్యాలగూడ పట్టణంలో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ముఖ్యంగా సాగర్ రోడ్డులో అవసరమైన చోట్ల యూ-టర్న్‌లను ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణను కోరారు. ఈ మేరకు బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వెలుగు ఇందిరా నాగరాజు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చిలుకూరి రమాదేవి శ్యామ్ లు చైర్‌పర్సన్‌కు వినతి పత్రం అందజేశారు.
పట్టణంలోని సాగర్ రోడ్డు నుండి నేషనల్ హైవేకు వెళ్లే మార్గంలో రోడ్డు సెంటర్లలో ఏర్పాటు చేస్తున్న రాతి డివైడర్ల వల్ల పాదచారులు, ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని వారు తెలిపారు.
ప్రజలకు అసౌకర్యం కలగకుండా సాగర్ రోడ్డు వెంట ఎల్ఐసి కార్యాలయం, సాయిబాబా గుడి ఆర్చి వద్ద, గాంధీ బొమ్మ వద్ద, గణేష్ గుడి వద్ద యూ-టర్న్‌లను ఏర్పాటు చేయాలని బీజేపీ తరఫున విజ్ఞప్తి చేశారు.
రైతు బజార్, కె.ఆర్. ఎస్టేట్ ల రహదారుల వద్ద కూడా పాదాచారుల కోసం, మనుషులు నడిచే విధంగా యూ-టర్న్‌లను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
పట్టణ ప్రజల ఇబ్బందులను తొలగించి, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు కోరారు.












