🐐 మేషం
ఫలితాలు: ప్రారంభించే పనుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వాలి.
పరిష్కారం: శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
🐂 వృషభం
ఫలితాలు: శుభ ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్య సమస్య పరిష్కారమవుతుంది. నూతన వస్తువుల కొనుగోలుకు అవకాశం ఉంది.
పరిష్కారం: హనుమాన్ చాలీసా పఠనం శుభప్రదం.
💑 మిధునం
ఫలితాలు: ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
పరిష్కారం: ఇష్టదేవత దర్శనం చేయడం మంచిది.
🦀 కర్కాటకం
ఫలితాలు: ఆలోచనలు విజయవంతం అవుతాయి. ఒక శుభవార్త కుటుంబానికి సంతోషాన్ని తెస్తుంది.
పరిష్కారం: శివారాధన శుభప్రదం.
🦁 సింహం
ఫలితాలు: ఇంటి వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో చిన్న విభేదాలు తలెత్తవచ్చు.
పరిష్కారం: దుర్గా స్తోత్రం పఠించండి.
💃 కన్యా
ఫలితాలు: లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే విజయాలు సాధ్యమే. కొందరి ప్రవర్తనతో ఇబ్బంది కలగవచ్చు.
పరిష్కారం: నవగ్రహ ఆరాధన శుభప్రదం.
⚖ తుల
ఫలితాలు: అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
పరిష్కారం: దైవారాధనకు ప్రాధాన్యం ఇవ్వాలి.
🦂 వృశ్చికం
ఫలితాలు: మంచిమనసుతో చేసిన పనులు త్వరగా నెరవేరతాయి. మానసిక శక్తిని పెంచుకునే సంఘటనలు ఎదురవుతాయి.
పరిష్కారం: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
🏹 ధనుస్సు
ఫలితాలు: ముఖ్య కార్యక్రమాలు ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. శ్రమకు తగిన గుర్తింపు పొందేందుకు కష్టపడాలి.
పరిష్కారం: విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
🐊 మకరం
ఫలితాలు: ప్రయత్నాలు విజయవంతమవుతాయి. కుటుంబ ప్రీతి మరింతగా పెరుగుతుంది.
పరిష్కారం: ఇష్టదైవ ధ్యానం మంచిది.
🏺 కుంభం
ఫలితాలు: శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీ కీర్తి మరింతగా పెరుగుతుంది.
పరిష్కారం: శ్రీ సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠించడం శ్రేయస్కరం.
🦈 మీనం
ఫలితాలు: వృత్తి, వ్యాపారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అధికారులతో నమ్రతగా ప్రవర్తించండి.
పరిష్కారం: నవగ్రహ శ్లోకాలు పఠించండి.
: లగచర్లను రేవంత్ లంకలా మార్చారు: మాజీ మంత్రి పొన్నాల