- నటి జత్వాని అరెస్ట్ వ్యవహారంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్.
- పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నిలు సస్పెండ్.
- వేదింపులకు గురైన నటి కాదంబరి జత్వాని ఫిర్యాదు ఆధారంగా సస్పెన్షన్.
- మొత్తం 15 మంది పోలీస్ అధికారులు వివాదంలో.
ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లపై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. జత్వానీని అక్రమంగా అరెస్టు చేయడంలో వారి ప్రమేయంపై విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరో 10 మంది అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ముంబై నటి కాదంబరి జత్వాని అరెస్ట్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌లపై కఠిన చర్యలు తీసుకుంది. నటి జత్వానీ ఫిర్యాదులో ఆమెపై తప్పుడు కేసు పెట్టి, అక్రమంగా అరెస్ట్ చేయడంలో ప్రమేయం ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నిలను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఘటనలో దర్యాప్తు అనంతరం అధికారులు చేసిన నివేదికల ఆధారంగా ఐపీఎస్‌లు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన కేసుతో పాటు, జత్వానీని అక్రమంగా అరెస్టు చేసిన వ్యవహారంపై మరింత విచారణ జరుగుతోంది. ఇప్పటికే మరో ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకోగా, మిగిలిన 10 మంది పోలీస్ అధికారులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.