స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే.. ప్రభుత్వం నెక్స్ట్ ప్లాన్ ఇదేనా!
తెలంగాణలో ఇవాళ MPTC, ZPTC ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. కాగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణగా జరగగా.. స్థానిక ఎన్నికలపై స్టే విధించింది. దీంతో ఈ ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ సర్కార్ ప్లాన్ బీ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు ఆగకుండా పాత రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకు వెళ్తుందని సమాచారం.