- శ్రీరామ సేన వెల్పేర్ సొసైటీ అధ్యక్షుడు తీగేలా భాస్కర్ గణనాథుడి దర్శనం
- గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు
- అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భాస్కర్ మరియు సొసైటీ సభ్యులు
నాగర్ కర్నూల్ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ సేన వెల్పేర్ సొసైటీ అధ్యక్షుడు తీగేలా భాస్కర్ 19వ వార్డులో గణనాథుడిని దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సుఖసంతోషం కోసం ప్రార్థించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భాస్కర్ సహా సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 15న నాగర్ కర్నూల్ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ సేన వెల్పేర్ సొసైటీ అధ్యక్షుడు తీగేలా భాస్కర్ 19వ వార్డులోని గణపతి మండపాన్ని సందర్శించి, గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రగడ్డ, వినోభా నగర్, గోకుల్ సింఫికెట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని, విగ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, రైతులు పండించిన పంటలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థించారు.
తదుపరి, భాస్కర్ గణేష్ మండపం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా గణేష్ మండప నిర్వాహకులు భాస్కర్ తో పాటు శ్రీరామ సేన వెల్పేర్ సొసైటీ సభ్యులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దాసరి నిరంజన్, జనరల్ సెక్రటరీ ఏటీగడ్డ శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీ సుక్క వెంకటస్వామి, లీగల్ అడ్వైజర్ గుర్రం శ్రీనివాసులు, ఇతర సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.