అంత్యక్రియలకు కూడా బంధువులు లేరు – ముందుకు వచ్చిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం –
కన్నెలూరులో అనారోగ్యంతో మరణించిన వ్యక్తికి అంతిమ సంస్కారాలు చేసిన సేవా సంస్థ సభ్యులు
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి జమ్ములమడుగు ప్రతినిధి నవంబర్ 09
జమ్మలమడుగు మండలం కన్నెలూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన మానవత్వానికి అద్దం పట్టింది. రాజ అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించగా, ఆయనకు బంధువులు లేదా సన్నిహితులు ఎవరూ అంతిమ సంస్కారాల కోసం ముందుకు రాలేదు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు “మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్” టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్‌కి సమాచారం అందించగా, ఆయన వెంటనే స్పందించారు. ఆయన ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు సుబహన్, సుమన్ బాబు, సురేష్, ప్రసన్న కుమార్, మరియు ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు కలిసి హిందూ సంప్రదాయం ప్రకారం రాజ అంత్యక్రియలను హిందూ స్మశాన వాటికలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్‌కి మరియు అందరికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక సేవలో నిరంతరం ముందుండే ఈ సంస్థ “మా శ్రీ అమ్మ శరణాలయం”లోని వృద్ధులకు సాయపడదలచిన దాతలు 82972 53484, 91822 44150 నంబర్లలో సంప్రదించవచ్చని విజ్ఞప్తి చేసింది.