అంత్యక్రియలకు సహకరించిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – జమ్మలమడుగు, డిసెంబర్ 11
జమ్మలమడుగు వద్దిరాల్లో నివాసం ఉన్న చాపిరాల్ల రామ సుబ్బమ్మ (85) అనారోగ్యంతో మరణించారు. అంతిమ సంస్కారాలకు బంధువులు ముందుకు రాకపోవడంతో, స్థానికులు సమాచారం అందించగా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్ స్పందించారు.ఫౌండేషన్ సభ్యులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమానికి చేయూతనిచ్చిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, అహమ్మద్ హుస్సేన్, మునీంద్రా, కిరణ్, అశోక్, కృపా ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు సుమన్ బాబు, ప్రసన్న కుమార్ తదితరులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.వృద్దులు, నిరుపేదుల సేవలో ముందుండే మా శ్రీ అమ్మ శరణాలయంకు దాతలు సహకరించాలనుకుంటే క్రింది నెంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు కోరుతున్నారు:
📞 82972 53484, 91822 44150