సమాజ హితం… ఆమెవా అభిమతం కావాలి

సమాజ హితం… ఆమెవా అభిమతం కావాలి

బైంసా, నవంబర్ 12 (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):

సమాజ హితం అమెవా అభిమతంగా ఉండాలని బైంసా ఆరె మరాఠా సంఘం అధ్యక్షులు కదం మోహన్ రావు పాటిల్ అన్నారు. ఇటీవల ఎన్నికైన ఆరె మరాఠా ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (AMEWA) నూతన కార్యవర్గానికి ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అమెవా గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన వీర్బా పాటిల్, అధ్యక్షులు ప్రదీప్ పాటిల్, ప్రధాన కార్యదర్శి బాబురావు పాటిల్ లను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మరాఠా సంఘం గౌరవాధ్యక్షులు జాధవ్ పుండలిక్ రావు పాటిల్ మాట్లాడుతూ — “అమెవా నూతన కార్యవర్గ సభ్యులందరూ ఐక్యంగా పనిచేసి, మరాఠా సమాజాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలి” అని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరె మరాఠా సంఘం ప్రధాన సలహాదారు కంఠాలే రఘువీర్ పాటిల్, ఉపాధ్యక్షులు సూర్యవంశీ కాశీరాం పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment