బీసీ కోటా పెంపు కసరత్తు మళ్లీ మొదటికి..!!

  • కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.
  • బీసీ రిజర్వేషన్లపై ముందు జరిపిన అధ్యయనాలు అటకెక్కినట్లు.
  • బీసీ రిజర్వేషన్లపై మరొక కొత్త అధ్యయనం ప్రారంభం.

బీసీ రిజర్వేషన్లపై కమిషన్

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై కసరత్తు మళ్లీ మొదటికొచ్చింది. ప్రభుత్వం తాజాగా జి.నిరంజన్ ఆధ్వర్యంలో కొత్త బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేసేందుకు కమిషన్ పనులు పునః ప్రారంభం కానున్నాయి. ఇంతకుముందు రెండు కమిషన్లు చేసిన పరిశీలనలు కొత్త కమిషన్ ఏర్పాటుతో అటకెక్కినట్లు తెలుస్తోంది.

 

తెలంగాణలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. రెండు కమిషన్లు ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి. అయితే ప్రభుత్వం తాజాగా జి.నిరంజన్ అధ్యక్షతన మరో కొత్త బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కొత్త కమిషన్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పై మరోసారి పునః అధ్యయనం చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రం విడిపోయిన తరువాత బీఎస్ రాములు, వకుళాభరణం కృష్ణమోహన్ వంటి నాయకత్వంలో పనిచేసిన బీసీ కమిషన్లు ఇప్పటికే రిజర్వేషన్లపై లోతైన అధ్యయనాలు పూర్తి చేశాయి. అయితే ఇప్పుడు కొత్త కమిషన్‌తో, గతంలో చేసిన పరిశీలనలు అటకెక్కినట్లు నిపుణులు భావిస్తున్నారు. కమిషన్ త్వరలోనే జిల్లాల వారీగా పర్యటించి పరిస్థితులను విశ్లేషించి, కొత్త అధ్యయనాన్ని సమర్పించనుంది.

Leave a Comment