ఫిజిక్స్ ఉపాధ్యాయుడిపై ఆరోపణలు సత్యదూరం

ఫిజిక్స్ ఉపాధ్యాయుడిపై ఆరోపణలు సత్యదూరం

శంకర్ భవన్ పాఠశాల పనితీరును విద్యాధికారులు ప్రశంసించారు : హెచ్‌ఎం ఏ. సాయన్న

నిజామాబాద్, జనవరి 08 (మనోరంజని తెలుగు టైమ్స్):

నిజామాబాద్ నగరంలోని కోట గల్లిలో ఉన్న శంకర్ భవన్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఫిజిక్స్ ఉపాధ్యాయుడిపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, సత్యదూరమైనవని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ. సాయన్న స్పష్టం చేశారు.
ఫిజిక్స్ ఉపాధ్యాయుడు పాఠశాలకు యధావిధిగా హాజరవుతూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్నారని, బోధనా ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని తెలిపారు. పాఠశాల అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుండగా, విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు.
ఇప్పటికే సంబంధిత విద్యాధికారులు పాఠశాల పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ప్రశంసలు అందజేశారని హెచ్‌ఎం తెలిపారు. ఈ నేపథ్యంలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిపై లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు.
ఇటీవల మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో వివరణ కోరగా, పాఠశాల సిబ్బంది అంతా సమిష్టిగా పని చేస్తూ విద్యార్థులకు సక్రమంగా బోధన అందిస్తున్నారని స్పష్టం చేశారు. ఫిజిక్స్ ఉపాధ్యాయుడి బోధనపై ఎలాంటి సందేహాలకు తావు లేదని తేల్చిచెప్పారు.
ఆరోపణలను విరమించి పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సహకారం అందించాలని హెచ్‌ఎం ఏ. సాయన్న విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment