టీజీఈ జెఎసి అదిలాబాద్ జిల్లా అధ్యక్షుని పదవి విరమణ సన్మాన సభ
మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.
టీఎన్జీవో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ మరియు టీజేఈ జేఏసీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సంద అశోక్ పదవి విరమణ సన్మాన సభలో ముఖ్యఅతిథిగా టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ మరియు ప్రధాన కార్యదర్శి ఎస్ ఎం ముజీబ్ హుస్సేని విచ్చేయగా మంచిర్యాల జిల్లా టీఎన్జీవో అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో టిఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్ కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్ , టిఎన్జీవో మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు కందుకూరు సురేష్ బాబు మరియు మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కోశాధికారి సతీష్ కుమార్ ఉపాధ్యక్షులు శ్రీధర్ రాజు నరేందర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రావణ్ బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ పాల్గొని ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలుపనైనది. తర్వాత జరిగిన సన్మాన సభలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి మాట్లాడుతూ టీఎన్జీవో కేంద్ర సంఘం కు మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంద అశోక్ తినలేని సేవలు అందించి యూనియన్ అభివృద్ధికి వంద శాతం కృషి చేశారని టీఎన్జీవో అంటేనే అశోక్ అని బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అశోక్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు టీఎన్జీవో యూనియన్ కు చేసిన సేవలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయులు మరువలేరని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయుల మదిలో ఎల్లప్పుడూ అశోక్ ఉంటారని మరియు టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కు అశోక్ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలని కోరడం జరిగినది.