ఉచిత స్టడీ మెటీరియల్‌ను అందించిన సయ్యద్ అర్జమంద్ అలీ

సయ్యద్ అర్జమంద్ అలీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేస్తున్న దృశ్యం
  1. సొంత డబ్బులతో ఉచిత స్టడీ మెటీరియల్ అందజేసిన నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్.
  2. TG-TET ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు 80 మందికి పైగా మెటీరియల్ పంపిణీ.
  3. మైనారిటీల విద్యా అభివృద్ధికి సయ్యద్ అర్జమంద్ అలీ కృషి.

నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జమంద్ అలీ సొంత డబ్బులతో TG-TET ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేశారు. మైనారిటీల విద్యా అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉచిత కోచింగ్ ముగింపు సందర్భంగా 80 మందికి పైగా విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది.


నిర్మల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జమంద్ అలీ మైనారిటీల విద్యా అభివృద్ధి కోసం నిస్వార్థ సేవ చేస్తూ TG-TET ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముహమ్మదియా హైస్కూల్ మౌలానా ఆజాద్ నగర్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఉచిత కోచింగ్ ముగింపు సందర్భంగా 80 మందికి పైగా విద్యార్థులకు ఈ మెటీరియల్ పంపిణీ చేశారు.

సయ్యద్ అర్జమంద్ అలీ తన సొంత ఖర్చుతో ఈ సేవ చేయడం విశేషంగా నిలిచింది. కోచింగ్ నిర్వహణలో మహ్మదీయ హైస్కూల్ యాజమాన్యం, అధ్యాపకులు, మరియు ఇతర సమాజ పెద్దలు సహకరించారు. సయ్యద్ అర్జమంద్ అలీని ప్రోత్సహిస్తూ, విద్యార్థులకు సహకారం అందించినందుకు ప్రతి ఒక్కరూ అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version