కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వర్ణ, కప్పన్ పల్లి గ్రామాల ఏకగ్రీవ సర్పంచులు..

కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వర్ణ, కప్పన్ పల్లి గ్రామాల ఏకగ్రీవ సర్పంచులు..
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి రావు .

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 06
కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వర్ణ,  కప్పన్ పల్లి గ్రామాల ఏకగ్రీవ సర్పంచులు..

నిర్మల్ జిల్లా,సారంగాపూర్ మండలం స్వర్ణ (పొన్కుర్) గ్రామ సర్పంచ్ గా కొత్తింటి మల్లేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారం ముగిసింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అబ్దుల్ ఆసిఫ్ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో మల్లేష్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నికైన మల్లేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే మామడ మండలం కప్పన్ పల్లి గ్రామ సర్పంచ్ గా చుంచు బాపు లింగన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని శ్రీహరిరావు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించి అభినందించారు. ఇందులో నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లు సోమ భీమ్ రెడ్డి, అబ్దుల్ హదిల్, సారంగాపూర్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజ మొహమ్మద్, మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కొంకూరు స్వర్ణ గ్రామ మాజీ సర్పంచ్ ,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment