జర్నలిస్టు రామచందర్ పై దాడి అనుమానాలు – బాధ్యులపై చర్యల డిమాండ్

  • ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్ర గాయాలతో కోమాలో ఉన్న జర్నలిస్టు రామచందర్ గౌడ్.
  • స్థానికుల చేతుల మీదుగా దాడికి గురయ్యారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.
  • ఘటనపై సరిగ్గా విచారణ జరపాలని గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యుల డిమాండ్.

 

సారంగాపూర్ సమీపంలో జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్ర గాయాలు పొందిన జర్నలిస్టు రామచందర్ గౌడ్ పై స్థానికులు విచక్షణారహితంగా దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రామచందర్ కోమాలో ఉండగా, ఘటనపై పోలీసుల పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

 

నిర్మల్ జిల్లా సారంగాపూర్ సమీపంలో గత శనివారం జర్నలిస్టు రామచందర్ గౌడ్ ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. విధి నిర్వహణలో భాగంగా వార్తలు సేకరించడానికి వెళ్లిన రామచందర్ తిరిగి వస్తుండగా సాయి నగర్ గ్రామ సమీపంలో రెండు వ్యక్తులను ఢీకొని ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడం జరిగింది. ప్రమాదంలో రామచందర్‌తో పాటు ఢీకొట్టిన వ్యక్తులు కూడా గాయపడ్డారు.

తలకి తీవ్ర గాయాలు కావడంతో, 108 అంబులెన్స్ ద్వారా నిర్మల్ ఆసుపత్రికి తరలించారు, అనంతరం వైద్యుల సూచన మేరకు నిజామాబాద్ తరలించారు. రామచందర్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న దాని ప్రకారం, ప్రమాదం అనంతరం అక్కడ ఉన్న స్థానికులు రామచందర్‌ను విచక్షణారహితంగా కొట్టారని, దీనివల్లే ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారని వారు భావిస్తున్నారు.

ఈ ఘటనపై సారంగాపూర్ గ్రామ ప్రజలు, రామచందర్ కుటుంబ సభ్యులు పోలీసులకై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Leave a Comment