*మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు!*

*మాధ్యమాల్లో రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు!*

మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి*

పెద్దపల్లి జిల్లా: నవంబర్20
సామాజిక మాధ్యమాల్లో ఇరు వర్గాలను రెచ్చగొట్టే విధంగా అనుచిత పోస్టులపై కఠిన చర్యలు తప్పవని, పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డేగ రమేష్, హెచ్చరించారు.

సోషల్ మీడియాలో వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్ట కు భంగం కలిగించేలా, దురుద్దేశాలను ఆపాదిస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అనుచిత, విద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఆయన ఒక ప్రకటనలో హెచ్చరించారు.

సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించు కోవాలి. మతం, వర్గ, ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు, వీడియోలు లేదా వ్యాఖ్య లు చేస్తే చట్టపరమైన చర్యలు అనివార్యం అని ఎస్సై డేగ రమేష్,స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment