బాసర, జూలై 19
కుటుంబ కలహాలతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ మహిళ గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించగా, బాసర పోలీసులు సకాలంలో స్పందించి ఆమెను కాపాడారు. కుబీర్ మండలం వర్ని గ్రామానికి చెందిన మగిరి సంగీత (23) ఈ ఘటనలో బాధితురాలు.
కుటుంబ కలహాలతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ మహిళ గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు యత్నించగా, అప్రమత్తంగా వ్యవహరించిన బాసర పోలీసులు ఆమెను సురక్షితంగా రక్షించారు.
కుబీర్ మండలం వర్ని గ్రామానికి చెందిన మగిరి సంగీత (23), శ్రీనివాస్ భార్య, కుటుంబంలో నెలకొన్న విభేదాల కారణంగా బాసర గోదావరి నది వద్దకు వెళ్లి ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించింది. అక్కడ విధుల్లో ఉన్న బాసర పోలీసు సిబ్బంది ఆమెను గమనించి వెంటనే అడ్డుకుని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
అనంతరం ఆమెను బాసర పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. పరిస్థితిని కుటుంబ సభ్యులకు వివరించి, ఆమె తండ్రి మగిరి పోశెట్టి (రాంపూర్, నర్సాపూర్ మండలం)కు బాధ్యతగా అప్పగించారు.
పోలీసుల అప్రమత్తతతో ఓ మహిళ ప్రాణాలు నిలవగా, వారి మానవత్వాన్ని స్థానికులు అభినందించారు.












