హైదరాబాద్, జులై 19
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ కావడంతో, అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబరు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించనున్నారు.
ఈ మేరకు కేంద్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో, ఆగస్టు 1 నుంచి మూడు నెలల బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణంగా ప్రతి నెల మొదటి 15 రోజులు మాత్రమే డీలర్లు రేషన్ బియ్యం ఇచ్చేవారు. వచ్చే నెలలో 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనున్నందున, ఆగస్టులో 31 రోజులు దుకాణాలు తెరిచి బియ్యం అందించాల్సి ఉంది. ప్రతి రేషన్ కార్డుదారు మూడు సార్లు వేలిముద్రలు వేయాల్సి ఉంటుంది.












