మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 28
ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో ఫ్యామిలీ రిజిస్టర్ (కుటుంబ నమోదు) తప్పనిసరి చేయనుంది. రేషన్ కార్డుల్లోని సమాచారం ఆధారంగా ఈ రిజిస్టర్ను సిద్ధం చేయనున్నారు. ప్రజలకు అవసరమైనప్పుడు మీసేవ కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది. అయితే, ఈ సర్టిఫికెట్ కేవలం కుటుంబ సభ్యుల వివరాలను ధ్రువీకరించడానికేనని, ఆస్తులపై హక్కులు లేదా లీగల్ హెయిర్ నిర్ధారణకు ఉపయోగపడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల నిమిత్తం కుటుంబ వివరాల ధ్రువీకరణకు ప్రస్తుతం సరైన అధికారిక రికార్డులు లేవు. లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాల కోసం వారు చెప్పిందే ఆధారంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలు తమ కుటుంబ సభ్యుల వివరాలతో అధికారిక సర్టిఫికెట్ పొందేందుకు అవకాశం లేదు. ఈ సమస్యలకు పరిష్కారంగా, అధికారికంగా ఫ్యామిలీ రిజిస్టర్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఫ్యామిలీ రిజిస్టర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలు వివిధ పేర్లతో రాష్ట్ర స్థాయి కుటుంబాల డేటాబేస్లను నిర్వహిస్తున్నాయి. కుటుంబ రిజిస్టర్ నిర్వహణ, ప్రజలకు సర్టిఫికెట్లు జారీ చేసే బాధ్యతను రెవెన్యూ శాఖకు అప్పగించారు. ఈ మేరకు ఫ్యామిలీ రిజిస్టర్, సర్టిఫికెట్ల విధివిధానాలపై రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.