షాద్‌నగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
షాద్‌నగర్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ అమరవీరుల స్థూపం ఏర్పాటు కావడం తన 24 ఏళ్ల కల నెరవేరిందని తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చొరవను ఆయన అభినందించారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ అమరవీరుల స్థూపం ఏర్పాటు కావడం తన 24 ఏళ్ల కల నేడు సాకారమైందని తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో అమరవీరుల స్థూపం ఏర్పాటు సాధ్యపడలేదని, అయితే స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలంగాణ ఉద్యమకారుల మనోభావాలను గౌరవించి అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు.
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను చిరస్థాయిగా నిలిపేలా ఈ స్థూపం నిర్మాణం జరగడం సంతోషకరమని పేర్కొన్న రాజా వరప్రసాద్, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
అమరవీరుల త్యాగాలను భావితరాలకు చాటిచెప్పే స్ఫూర్తి కేంద్రంగా ఈ స్థూపం నిలుస్తుందని ఆయన అన్నారు.












