కుంటాల, ఆగస్టు 01
ఎస్ఆర్డీఎస్ (వీబీజీ రామ్‌జీ) ఎఫ్‌టీఈ ఉద్యోగులు తమ సమస్యలపై ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్‌కు వినతిపత్రం అందించారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న తమకు తగిన వేతన భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని వారు కోరారు.
ఎస్ఆర్డీఎస్ (వీబీజీ రామ్‌జీ) ఎఫ్‌టీఈ ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో ఏళ్లుగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్నామని ఉద్యోగులు తెలిపారు.
గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజలకు ప్రభుత్వ పథకాల సమాచారం చేరవేయడం, అధికారులకు క్షేత్రస్థాయి సహకారం అందించడం వంటి బాధ్యతలను నిర్వహిస్తున్నప్పటికీ తమకు తగిన వేతన భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ వేతనాలు, వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా కుటుంబ పోషణ భారంగా మారుతోందని పేర్కొన్నారు. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, ఇతర అవసరాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతమైన అమలులో తమ సేవలను గుర్తించి వెంటనే పే స్కేల్ అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని కోరారు. ఎఫ్‌టీఈ ఉద్యోగులకు స్థిరమైన వేతన విధానం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్‌ను విజ్ఞప్తి చేశారు.
గ్రామీణాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఎఫ్‌టీఈ ఉద్యోగుల పాత్రను గుర్తించి ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
వినతిపత్రం అందజేసిన వారిలో ఏపీవో గట్టుపల్లి నవీన్, షశిoధర్‌రావు, జాదవ్ జైసింగ్, మాధురి, నగరం కార్తీక్ తదితరులు ఉన్నారు.












