Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
నిర్మల్ మండలంలోని కొట్ల (కే) గ్రామ సమీపంలో ఉన్న సిద్ధాపూర్ లో-లెవల్ వంతెనను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ గురువారం మధ్యాహ్నం సందర్శించారు. స్వర్ణ నదిలో పెరుగుతున్న నీటి ప్రవాహాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులతో సమీక్షించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నిర్మల్ మండలంలోని కొట్ల (కే) గ్రామ సమీపంలో ఉన్న సిద్ధాపూర్ లో-లెవల్ వంతెనను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. స్వర్ణ నదిలో పెరుగుతున్న నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులతో పరిస్థితిని సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా స్వర్ణ నదిలో నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వర్ణ ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తివేసే అవకాశం ఉన్నందున నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు.
అవసరమైతే అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, లో-లెవల్ వంతెనలు, వాగులు, ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఈ పరిశీలనలో రూరల్ ఎమ్మార్వో ప్రభాకర్, ఆర్ఐ విజయ్ కుమార్, జీపీఓ ఇమ్రాన్ తదితర అధికారులు పాల్గొన్నారు.


