నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోరిగావ్లో తీవ్ర విషాదం నెలకొంది. సర్పంచ్ పల్లె జ్యోతి సోమవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు లేదా మరేదైనా కారణమా అనే కోణంలో విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.












