నగరపాలక శాఖ ఆధ్వర్యంలో అలీ సాగర్ వాటర్ వర్క్స్‌లో షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి గురైన కార్మికుడు గంగాధర్‌ను అధికారులు పరామర్శించి, అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
నిన్న సాయంత్రం అలీ సాగర్ పంప్ హౌస్‌లో జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా కార్మికుడు గంగాధర్ కాలిన గాయాలపాలయ్యారు. తోటి కార్మికులు వెంటనే అతన్ని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగాధర్‌ను నగరపాలక శాఖ అధికారులు కలిసి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం అనుకోకుండా జరిగిందని, ప్రస్తుతం గంగాధర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. వీర్ రాజు తెలిపారు.
గాయపడిన కార్మికుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచనలు జారీ చేశామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్మికుడు త్వరగా కోలుకోవాలని అధికారులు ఆకాంక్షించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. వీర్ రాజు, అసిస్టెంట్ ఇంజనీర్ భూమేశ్వర్, ఇంజనీర్ ఇనాయత్ కరీం తదితరులు పాల్గొన్నారు.












