నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని మోపాల్ పోలీస్ స్టేషన్‌ను శనివారం నిజామాబాద్ ఏసీపీ బి. ప్రకాష్ యాదవ్ సందర్శించారు.
ఈ సందర్శనలో, ఆయన స్టేషన్ పనితీరును సమీక్షించి, రికార్డులు, కేసు ఫైల్స్ మరియు పరిపాలనా వ్యవహారాలను పరిశీలించారు.
అయన పోలీసులకు విజిబుల్ పోలీసింగ్ మరియు ఎఫెక్టివ్ పెట్రోలింగ్‌ను పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. గ్రామాలు మరియు జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పోలీసుల ఉనికి స్పష్టంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
అలాగే, రికార్డులు మరియు ఫైల్స్‌ను సక్రమంగా నిర్వహించాలని, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో పనులను పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు.
ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలనే ఆదేశంతో, సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్‌ను విస్తరించాలనే సూచనతో ఆయన కార్యక్రమాన్ని ముగించారు.












