రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. దివ్యాంగులు సొంత కాళ్లపై నిలబడేలా ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11 వేల దివ్యాంగ పొదుపు సంఘాల ద్వారా దాదాపు 80 వేల మంది లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు.
అంతేకాకుండా, దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీలో ఉన్న కఠిన నిబంధనలను సవరించడం వల్ల ఎక్కువ మంది లబ్ధిదారులు సహాయం పొందగలుగుతున్నారని చెప్పారు.












