మిర్యాలగూడ, జూలై 19
మిర్యాలగూడ పట్టణంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఐఆర్) నమోదు కార్యక్రమం తీరును డిప్యూటీ తహసీల్దార్ కె.సైదిరెడ్డి ఆదివారం పరిశీలించారు. ప్రతి బూత్‌లో దరఖాస్తుల స్వీకరణ, ఓటరు వివరాల సవరణ, అర్హుల నమోదు, ధృవపత్రాల పరిశీలన, ప్రజలకు అందుతున్న సేవలపై ఆయన ఆరా తీశారు.
స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఐఆర్) నమోదు కార్యక్రమాన్ని మిర్యాలగూడ డిప్యూటీ తహసీల్దార్ కె.సైదిరెడ్డి పట్టణంలో ఆయా వాడలు ఆదివారం సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. ప్రతి బూత్ లో నమోదవుతున్న దరఖాస్తులు, ఓటరు వివరాల సవరణ ప్రక్రియ, అర్హులైన ఓటర్ల నమోదు, అవసర ధృవపత్రాల పరిశీలన, ప్రజలకు అందుతున్న సేవలను సమగ్రంగా ఆరాతీశారు.
కార్యక్రమం నిబంధనలకు అనుగుణంగా నిర్దేశ గడువులోపు పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రతి అర్హుడైన ఓటరుకు న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రజలకు అవసర అవగాహన కల్పిస్తూ ఎవరూ ఇబ్బందులు పడకుండా సేవలు అందించాలన్నారు.
బిఎల్ఓ, బిఎల్ఎలకు రాష్ట్ర ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా అత్యంత కీలకమని, ప్రతి అర్హుడి పేరు జాబితాలో ఉండేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రజలకు అవసర సహాయ సహకారాలు అందించాలన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ రెహ్మాన్, బిఎల్ఓ శ్రీదేవి పాల్గొన్నారు.












