బెల్లంపల్లి, 18 July
ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బెల్లంపల్లిలో ఇంటర్ చదువుతున్న ముగ్గురు బాలికలు మనస్పర్థల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. గురువారం రాత్రి గదిలో హెయిర్ డై తాగిన వారిని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉంది.
బెల్లంపల్లిలో ముగ్గురు బాలికలు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ముగ్గురు బాలికలు గది అద్దెకు తీసుకొని ఇంటర్ పూర్తి చేశారు. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో కలత చెందిన ముగ్గురు గురువారం రాత్రి గదిలో హెయిర్ డై తాగినట్లు తెలిసింది.
దీంతో వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం MNCLకు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.











