బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అమ్మ చేతి తొలి ముద్ద’ కార్యక్రమం బోథ్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడి కేంద్రం-6లో ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు, వారి ఆరోగ్యం, పరిశుభ్రత, సమతుల్య ఆహారం ప్రాధాన్యంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అమ్మ చేతి తొలి ముద్ద’ కార్యక్రమాన్ని బోథ్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడి కేంద్రం-6లో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని వార్డు సభ్యులు బరే ఐశ్వర్య, కట్కురి సాయి, కార్పె శ్రీనివాస్, కట్ట భూమేష్ ప్రారంభించి చిన్నారులకు పౌష్టికాహారం అందించారు. అనంతరం తల్లిదండ్రులకు చిన్నారుల ఆరోగ్యం, పరిశుభ్రత, సమతుల్య ఆహారం ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వార్డు సభ్యులు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న బాలల సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరోగ్యవంతమైన చిన్నారులే దేశ భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ వసంత, ఏఎన్ఎమ్, ఆశా వర్కర్, తల్లులు, చిన్నారులు, స్థానికులు పాల్గొన్నారు.












