Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్యారమూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులు, ఆసరా పింఛన్లపై గత వారం రోజులుగా సామాజిక తనిఖీ జరిగింది. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామ సర్పంచ్ వరలక్ష్మి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో తనిఖీ అధికారి వివరాలను వివరించి, అవగాహన కల్పించారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్యారమూర్ గ్రామంలో గత వారం రోజులుగా ఉపాధి హామీ పథకం పనులు, ఆసరా పింఛన్లకు సంబంధించి సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామ సర్పంచ్ వరలక్ష్మి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.
గ్రామసభలో సామాజిక తనిఖీకి సంబంధించిన వివరాలను తనిఖీ అధికారి గ్రామ ప్రజలకు పూర్తిగా వివరించారు. ఉపాధి హామీ పథకం పనులు, ఆసరా పింఛన్లకు సంబంధించిన అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాంరెడ్డి, ఉపాధి హామీ పథకం సహాయకుడు పోశెట్టి, పంచాయతీ కార్యదర్శి మహేందర్ సింగ్, వార్డు సభ్యులు మాధ దయాకర్, శ్రీరామ్ లక్ష్మణ్, పగడపు లక్ష్మణ్ (చింటు), పగడపు ముత్తవ్వ, క్షేత్ర సహాయకుడు లక్ష్మారెడ్డి, కారోబార్ భూషణ్ రెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.












