మిర్యాలగూడ మండలం తకెళ్ళపాడు గ్రామంలో శుక్రవారం నూతన ఇందిరమ్మ గృహాలను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్నా కైలాష్ నేత కూడా ఎమ్మెల్యేతో పాటు ఉన్నారు. లబ్ధిదారుల ఇళ్లలో సహపంక్తి భోజనం చేశారు.
తకెళ్ళపాడు గ్రామంలో నడింపెల్లి లక్ష్మయ్య, మైనవారి గూడెం గ్రామంలో గంగపూరి రేణుక యాదయ్యలకు చెందిన ఇందిరమ్మ గృహాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమం అనంతరం, ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఒక లబ్ధిదారుడి ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెలిపారు. సామాజిక సమానత్వం కోసం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ భోజనం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తక్కెలపాడు మాజీ సర్పంచ్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండు నరేందర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు బసవయ్య గౌడ్, సర్పంచ్ చిటికల సుజాత జానయ్య, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు తెలియజేశారు.












